Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేషం మార్చి.. ఖాట్మాండూలో తిరుగుతున్న హనీ ప్రీత్!

  • హనీ ప్రీత్ తో పాటు ముగ్గురు లేదా నలుగురు అనుచరులు
  • సాధారణ ప్రైవేటు ట్యాక్సీల్లో ప్రయాణాలు చేస్తున్న హనీ ప్రీత్ 
  • ఖాట్మాండూలో సెప్టెంబర్ 2న కనిపించిన హనీ ప్రీత్
డేరాబాబా గుర్మీత్ రాం రహీం సింగ్ సహచరి, దత్తపుత్రిక అయిన హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ కోసం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసుపై హర్యానా ప్రభుత్వం వేసిన సిట్ విభాగం రాజస్థాన్‌ లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్‌ ను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించింది. దీంతో హనీ ప్రీత్ గుట్టువీడింది. ఆమె నేపాల్ కు పారిపోయిందని తేలింది.

దీంతో వారు నేపాల్ లోని తమ సోర్స్ తో కనెక్ట్ అయి, ఆమె ఫోటోలు పంపారు. వెంటనే రంగంలోకి దిగిన సోర్స్.. ఆమె ఆచూకీని గుర్తించినట్టు తేలింది. సెప్టెంబర్ 2న నేపాల్ రాజధాని ఖాట్మాండూలో హనీప్రీత్ కనిపించిందని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది.

పోలీసు, నిఘా వర్గాలకు చిక్కకుండా ఉండేందుకు హనీ ప్రీత్ తన గెటప్ ను పూర్తిగా మార్చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ప్రయాణాలను గతంలోలా లగ్జరీ వాహనాల ద్వారా కాకుండా సాధారణ, ప్రైవేటు ట్యాక్సీలలో చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం. 
hani preet
dera bab
hanipreet in nepal
hanipreet make over

More Telugu News